BooksDirect

Description - Untouchable Warrior by Tangirala Sony

బాబాసాహెబ్ అంబేడ్కర్ "untouchable warrior" కవితా సంకలనం సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా వుంటుంది. ఇందులో రాసిన కవులు ఎప్పటినుంచో కవిత్వం రాస్తున్నవారు వున్నారు,ఇప్పుడు కొత్తగా రాస్తున్నవారు వున్నారు, అలాగే అసలు కవిత్వం రాద్దాం అని ప్రయత్నం చేసినవారు వున్నారు. మొత్తంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ 100 కవితల సంకలనంలో కవితలు రాయడం కోసం పోటి పడినవారు వున్నారు. ఇక అంబేడ్కర్ అంటరాని వాడు కదా ! బహుశా మనమేం రాస్తాం అనుకున్నవారు వుండొచ్చు. బాబాసాహెబ్ అంబేడ్కర్ 100 కవితల సంకలనం తీసుకువస్తున్నాం అని ప్రకటన ఇచ్చిన దగ్గర నుంచిచాలా మందిని కవిత రాయండి అంటే చూసీ చూడనట్లు వున్నవాళ్ళు వున్నారు. ఇక అసలు అందరూ కవిత్వం రాస్తున్నారు కదా! ఇంకా అంబేడ్కర్ గురించి కవితా సంపుటి అవసరమా ! అంటే అవసరమే అంటాను నేను !! ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేడ్కర్ వైపు చూస్తున్న కాలం. అందుకే100 మంది కవుల కవిత్వం ఈ "అన్ టచబుల్ వారియర్" కవితా సంపుటి . అంతకుముందు ఎప్పుడైనా ఇలా కవితా సంపుటి 100 మందితో వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. బహుశా 100 మందితో కూడా రాలేదు అనుకుంటా పూర్తిగా బాబాసాహెబ్ అంబేడ్కర్ పై. ఇక కవులారా! ఈ పుస్తకం ప్రజల్లోకి వెళ్ళడానికి మీకు తెలిసిన వారికి చెప్పండి . మీ కవిత వచ్చింది అని కాదు, దీంట్లో నా కవిత ప్రచురితమైంది ఈ "అన్ టచ్ బుల్ వారియర్" కవితా సంపుటిని కొనుక్కుని చదవండి అని. అలాగే కవిత రాసిన మీరు కూడా మీ కవిత లాగే ఇంకా 99 కవితలను కూడా చదవండి. బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి ఒక్కొక్కరూ ఒక్కో కోణంలోంచి తమదైన వ్యక్తీకరణ తో అందించారు.


- తంగిరాల. సోని

Buy Untouchable Warrior by Tangirala Sony from Australia's Online Independent Bookstore, BooksDirect.

A Preview for this title is currently not available.